మహిళా క్రికెటర్ మిథాలీ బయోపిక్..!

SMTV Desk 2017-09-26 15:22:16  The biography of the players, Mithali Raj, Cricketer bio pic.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : క్రీడాకారుల జీవిత కథ ఆధారంగా చేసుకొని సినిమా తీయడం అనేది కొత్తేం కాదు. నిజానికి అలా తీసిన సినిమాలన్నీ ఘన విజయాలు సాధించాయనే చెప్పాలి. అందులో "ఎంఎస్ ధోనీ", "మేరీ కోం", "అజ‌హ‌ర్‌", "సచిన్", “దంగల్” వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూల్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు కొత్తగా సైనా నెహ్వాల్‌, జుల‌న్ గోస్వామిల జీవిత కథలు కూడా తెర మీదకు రానున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథను కూడా తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె జీవిత చరిత్రకు సంబంధించిన హక్కులన్నింటిని ప్రముఖ నిర్మాణ సంస్థ “వయోకామ్ 18 మోషన్ పిక్చర్” వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. పదహారేళ్ళ వయస్సులోనే బ్యాట్ పట్టుకొని సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్ గా మిథాలీ నిలవడం విశేషం. కాగా మహిళా సచిన్ టెండూల్కర్ గా పిలిచే మిథాలీ జీవిత కథ సినిమా హక్కులను దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని వయోకామ్ 18 ప్రతినిధి అజిత్ అందారే వెల్లడించారు.