‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ చిత్రానికి నిర్మాత జేడీ చక్రవర్తి..

SMTV Desk 2017-09-25 21:06:28  ram gopal varma, sr ntr, laxmi parvathi, jd chakravarthi

హైదరాబాద్ సెప్టెంబర్ 25: సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్ను సీనియర్ ఎన్టీఆర్ పై పడింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర పై సినిమా తీస్తానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు రూటు మార్చి ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ గా లక్ష్మి పార్వతి కోణంలో సినిమా తీస్తానని తెలిపారు. రామ్ గోపాల్ వర్మ లక్ష్మి పార్వతిని కలిసి ఈ విషయం పై చర్చలు జరిపినట్టు సమాచారం. కాగా ఈ చిత్రానికి జేడీ చక్రవర్తి నిర్మాతగా వ్యవహరించనున్నారని ఓ వార్త ఫిలిం నగర్ లో హల్‌చల్ చేస్తుంది. వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండటం వల్లే ఈ సినిమాకి నిర్మాతగా ఒప్పుకున్నారని తెలిసింది. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో..? తెలుసుకోవాలంటే వేచిచూడాల్సిందే.