దుర్గామాతకు 22 కేజీల బంగారు చీర బహుకరణ

SMTV Desk 2017-09-25 19:20:08  kolkata, Santosh Mitra Square , durgamatha in Santosh Mitra Square ,

కోల్‌క‌తా, సెప్టెంబర్ 25: దేశంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనేక చోట్ల భ‌క్తులు క‌న‌కదుర్గ విగ్రహాలను ప్రతిష్టించారు. చాలా ప్రాంతాలలో ఈ దేవి నవరాత్రులలో అమ్మవారికి రోజుకొక చీర కట్టి చివరి రోజు వేలం వేసే స౦ప్రదాయం కొనసాగుతుంది. కానీ తాజాగా ఓ పూజా కమిటీ దుర్గామాత కోసం 22 కేజీల బంగారంతో చీరను తయారుచేయించడం విశేషం. కోల్‌క‌తాలోని సంతోష్‌ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపం, అమ్మవారి విగ్రహం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఈ మండపాన్ని లండన్‌ థీమ్‌తో త‌యారు చేయగా, అమ్మవారి కోసం ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అగ్నిమిత్ర పౌల్ తో 22 కేజీల బంగారు చీరను డిజైన్ చేయించారు. ఈ చీరను త‌యారు చేయ‌డానికి సుమారు 50 మంది నిపుణులు శ్రమించారు. ఈ చీర‌పై పక్షులు, సీతాకోక చిలుకలు, నెమళ్లు, ర‌క‌ర‌కాల పూల‌ బొమ్మలను ఎంబ్రాయిడరీ చేయించారు. ఈ బంగారు నేత చీర ధరించిన దుర్గామాతను దర్శించుకునే౦దుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.