అరుదైన ఘనత సాధించిన.. రాజన్న సిరిసిల్ల జిల్లా

SMTV Desk 2017-09-25 19:19:52  Telangana, Rajanna-Cyrillila district, Svacchabharat rankings.

రాజన్న-సిరిసిల్ల, సెప్టెంబర్ 25 : తెలంగాణలోని రాజన్న-సిరిసిల్ల జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. స్వచ్ఛభారత్‌ మిషన్ లో భాగంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛత దర్పాన్ అనే కార్యక్రమంలో జాతీయ స్థాయిలో చరిత్రను సృష్టించింది. స్వచ్ఛభారత్‌ ర్యాంకింగ్స్‌లో ఈ జిల్లా పరిశుభ్రత, బహిరంగ మల విసర్జన రహిత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పరంగా మొదటిస్థానంలో ఉంది. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ, నదియా, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేరి, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలు కూడా ప్రథమ స్థానాన్ని సాధించినట్లు కేంద్రం జాబితాను ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు అధికారిక సమాచారం అందింది. కాగా కేంద్రం స్వచ్ఛత పరంగా నిర్వహించిన సర్వేలో స్వచ్ఛమైన తాగునీరు, ఇంటింటా చెత్త సేకరణలో వంద శాతం మార్కులను ఈ జిల్లా దక్కించుకున్నట్లు సర్వేలో తేలింది. సిరిసిల్ల పట్టణంతో పాటు మండలాల కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులను కేంద్రం పరిశీలించి, పరిశుభ్రమైన జిల్లాగా తేల్చింది.