యోగ నృసింహునిగా స్వామివారు..

SMTV Desk 2017-09-25 14:07:13  thirupathi, TTD, Srivenkatesvarasvami Brahmotsavam,

తిరుమల, సెప్టెంబర్ 25: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజు శ్రీవారు ఘనంగా మలయ్యప్ప స్వామి అవతారంలో సింహవాహనంపై ఊరేగించారు. యోగ నృసింహునిగా సింహ వాహనంపై అధిష్టించిన దేవదేవుడు తిరు వీధుల్లో తిరుగాడుతూ భక్తులకు అభయమిచ్చారు. దుష్ట జన శిక్షణకు, శిక్ష జన రక్షణకు సంకేతంగా సింహ వాహన సేవను నిర్వహిస్తారు. విష్ణు సహస్ర నామాల్లో స్వామికి నామాంతరంగా సింహః స్తోత్రాన్ని పఠిస్తారు. జగన్నాయకుడి అవతారాలలో నాలుగోది నృసింహ అవతారం. ముత్యపు పందిరిపై స్వామి వారు రాత్రి విహరించనున్నారు. సింహలా భక్తి బలం కలిగి ఉన్న వారిని స్వామి అనుగ్రహిస్తాడన్న నమ్మకంతో భక్తులు ఈ సేవలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల క్షేత్రానికి తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తితిదే అన్ని ఏర్పాట్లు చేసింది.