మూడు దేశాలకు ట్రావెల్ బ్యాన్ చేసిన ట్రంప్

SMTV Desk 2017-09-25 12:46:20  President Donald Trump, North Korea, Venezuela, Chad

వాషింగ్టన్, సెప్టెంబర్ 25 : అమెరికా భద్రతకు ముప్పు ఉందనే పేరుతో ఇప్పటికే ఆరు ముస్లీం దేశాలపై ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం అమెరికా. తాజాగా ఆరు దేశాల జాబితాలో ఉన్న సూడన్ ఆంక్షల్ని ఎత్తి వేసి. కొత్తగా ఉత్తరకొరియా, వెనెజుల, చాద్ దేశాలను నిషేధిత జాబితాల్లో చేర్చింది. నూతన ఆంక్షలకు సంబంధించిన పత్రాల పై సంతకం చేసిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికాను సురక్షితంగా ఉంచడమే తన తొలి కర్తవ్యమని ట్వీట్టర్ లో ప్రకటించారు. ఇరాన్‌, లిబియా, సిరియా, యెమన్‌, సోమాలియా పై విధించిన తొంబై రోజుల ఆంక్షల గడువు ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో ఈ కొత్త ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చారు. ఆ దేశాలపై కొత్త ఆంక్షలు అక్టోబర్ 18 నుంచి అమలు కానున్నాయని అమెరికా అధికారులు వెల్లడించారు. ఉత్తరకొరియా, చాద్ దేశాల ప్రయాణికులకు ఆంక్షలు పూర్తి స్థాయిలో వర్తించనుండగా మిగితా దేశాల ప్రయాణికుల పై పాక్షిక ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా రాయబారి కార్యాలయం వెల్లడించింది.