శ్రీ లలితత్రిపుర సుందరీదేవి అవతారంలో నేడు దుర్గమ్మ దర్శనం

SMTV Desk 2017-09-25 12:00:53  vijayawada kanakadhurgamma, dassera celebrations in 5th day lalithatripura sundaridevi,

విజయవాడ, సెప్టెంబర్ 25 : బెజవాడ ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ, ఐదో రోజైన నేడు లలిత త్రిపుర సుందరీ దేవిగా ఆశ్వయుజ శుద్ధ పంచమిన బంగారు వర్ణం చీరలో భక్తులకు అభయమిస్తుంది. పరమ శివుని ఆశీసురాలైన దుర్గమ్మ, చేతిలో చెరుకు గడ్డ పట్టుకుని దర్శనం ఇస్తుంది. లలిత త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా, పంచ దశాక్షరి, మహా మంత్రాద్రి దేవతాగా కొలుస్తారు. అమ్మవారికి ఇరు వైపులా లక్ష్మీదేవి, సరస్వతి వింజ్యా మరలతో సేవిస్తూ ఉండటం విశేషం. వేలాదిగా తరలివస్తున్న భక్తజనంతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల మౌలిక వసతులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.