నోకియా 8... త్వరలో మార్కెట్లోకి

SMTV Desk 2017-09-24 16:50:56  New delhi, Nokia-8, HMD Global,

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 24: ఒకప్పుడు ఫీచర్ ఫోన్ లలో రారాజుగా వెలుగొంది మరుగునపడిపోయిన నోకియా ఫోన్లు రీ లాంచ్ కోసం దుసుకోస్తోంది. హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా బ్రాండ్ పేరు మీద వరుస స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. తాజాగా నోకియా 8 ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించింది. నోకియా 8 ప్రత్యేకతలు.. 5.3 అంగుళాల తాకే తెర, 1.8 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 13 మెగా పిక్సెల్‌ ముందు, వెనుక కెమేరాలు, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత మెమొరీ, 3090 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ నూగట్‌ 7.1.1తో పనిచేస్తుంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ సెప్టెంబర్‌ 26న భారత్‌ మార్కెట్‌లోకి ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది.