108 ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ...

SMTV Desk 2017-09-24 16:11:48  108 Employees, Monetary document, AP CM Chandrababu naidu

అమరావతి, సెప్టెంబర్ 24 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 108 ఉద్యోగులు తమ సమస్యను పరిష్కరించలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విన్నవించారు. అసలు విషయంలోకి వెళితే... ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నతాము, తమ కుటుంబాలు మాత్రం దుర్భర జీవితాలు గడుపుతున్నట్లు 108 సిబ్బంది ఉద్యోగులు సీఎంకు విన్నవించారు. పన్నెండేళ్లుగా సేవలందిస్తున్నా తమకు 10 వేల రూపాయల జీతం కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పన్నెండు గంటలు పని చేయటంతో పాటు కనీస వేతన చట్టం తమకు అమలు కావడం లేదని వాపోయారు. కాగా ముఖ్యమంత్రిని కలిసి సచివాలయంలో ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. మా 108 ఉద్యోగుల సమస్యలను చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడం తమకు ఊరాటను ఇచ్చిందని వారు వెల్లడించారు.