మిషన్ భగీరథ పై కేసీఆర్ సమీక్ష

SMTV Desk 2017-09-24 13:34:34   Mission Bhagiratha, CM KCR, Pragathibavan, google map, kadiyam srihari

హైదరాబాద్, సెప్టెంబర్ 24 : మిషన్ భగీరథ పనులను రెండు భాగాలుగా విభజించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులని ఆదేశించారు. తొలి భాగాన్ని డిసెంబర్ 31లోగా, మరో 6 నెలల్లో రెండో విడతను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రగతి భవన్ లో మిషన్ భగీరథ గురించి సమీక్షించిన సీఎం గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. మొదటి భాగంలో డిసెంబర్ చివరినాటికీ 25 వేల ఆవాసా ప్రాంతాలకు నీరు అందించి, గ్రామాల్లో అంతర్గత పైప్ లైన్లు నల్లాలు ఏర్పాటు చేయాలన్నారు. పార్ట్-2 పనులు కూడా 2018 మొదటి అర్ధభాగంలోగా పూర్తి కావాలని కేసీఆర్ అన్నారు. 24225 ఆవాసా ప్రాంతాలకు మంచి నీరు అందించాలనేదే లక్ష్యమన్న కేసీఆర్ ఇప్పటికే 3431 గ్రామాలకు త్రాగునీరు అందిస్తున్నమన్నారు. అక్టోబర్ చివరినాటికి మరో 5443 గ్రామాలకు మంచి నీరు అందుబాటులోకి తెస్తామన్నారు. నవంబర్ చివరినాటికి 6006 గ్రామాలకు డిసెంబర్ ఆఖరుకు మిగతా 9345 గ్రామాలకు నీరందించాలని నిర్దేశించారు. పాలేరు నియోజక వర్గ పరిధిలోని మిషన్ భగీరథ పనుల తీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి కడియం నేతృత్వంలో పాలేరు సెగ్మెంట్ ను సందర్శించి పనుల తీరును సమీక్షించాలని ఆయన ఆదేశించారు. మిషన్ భగీరథకు విద్యుత్ అందించేందుకు ఆ శాఖ చేసిన ఏర్పాట్లను సీఎం అభినందించారు. ఈ మేరకు పనులన్నీ అక్టోబర్ 2 నాటికీ పూర్తవుతాయని జంకో, ట్రాన్స్ కో సీఎంసీ హామీఇచ్చారు.