"థ్యాంక్యూ.. సుష్మాజీ" కాంగ్రెస్ ను గుర్తించారు : రాహుల్ గాంధీ

SMTV Desk 2017-09-24 13:32:57  Indian Foreign Minister, Sushma Swaraj, Congress vice president, Rahul Gandhi.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 : భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా "పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే ప్రముఖ కర్మాగారం" గా మారిందని ఘాటు విమర్శలు చేసారు. ఆమె ప్రసంగించిన తీరుపై జాతి యావత్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండియా ఇప్పటికే ఐఐటీ, ఐఐఎంలతో విద్యావంతులను తయారు చేస్తుంటే, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదులను తయారు చేస్తుంద" ని ఐరాస సభలో సుష్మా వెల్లడించారు. ఈ తరుణంలో సుష్మా తీరుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాస్త విభిన్నంగా స్పందిస్తూ.. "సుష్మాజీ... మీకు చాలా థ్యాంక్స్.. మీ ప్రసంగంలో ఐఐఎం, ఐఐటీల గురించి ప్రస్తావించారు. కనీసం ఈ విధంగానైనా మీరు కాంగ్రెస్ పనితీరును, గొప్పతనాన్ని గుర్తించారు" అంటూ ట్వీట్ చేసారు. కాగా రాహుల్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్ లు మండిపడుతున్నారు. సుష్మాజీ ఈ దేశం గురించి మాట్లాడితే మీరు పార్టీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పెద్ద విద్యాసంస్థలను నెలకొల్పి, భారీ కుంభకోణాలకు సైతం పాల్పడ్డారంటూ విమర్శల ధాటిని చూపించారు.