ఉత్తరకొరియాలో నమ్మలేని నిజాలను బయటపెట్టిన మహిళ..

SMTV Desk 2017-09-23 16:03:08  North Korea, South Korea, President, Kim Jong-un

ఉత్తరకొరియా, సెప్టెంబర్ 23 : ఉత్తరకొరియాలో మహిళలు భయంకరమైన నరకాన్ని అనుభవిస్తున్నారని.. ఆ దేశం నుండి తప్పించుకొని వచ్చిన మహిళ అక్కడి బాహ్య ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది. వివరాలలోకి వెళితే... హీయోన్ లిమ్(26) అనే యువతిని కిమ్ సైన్యం టీనేజ్ లో ఉండగా ఎత్తుకెళ్ళారు. ఆ తర్వాత కిమ్ పరివారం అంతా కలిసి ఆమెను సెక్స్ కు బానిసగా చేస్తూ ప్రతి ఇంటికి తిప్పేవారని, ఒకరి తర్వాత ఒకరి ఇంటికి బానిసగా పంపుతూ నరకం చూపిస్తున్నారని ఆమె వాపోయింది. ఇంకా తనలాంటి వారు చాలా మంది అక్కడే బానిసలుగా మగ్గిపోతున్నారని తెలిపింది. అంతేకాకుండా వారంతా నరకం అనుభవిస్తూ.. నలిగిపోతుంటే కిమ్ పరివారం మాత్రం సంతోషంతో మరింత రెచ్చిపోతారని తన ఆవేదనను వ్యక్తం చేసింది. తమకు నచ్చినట్టు నడుచుకోకపోయినా, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, గర్భం దాల్చినా వారిని అంతం చేసేందుకు కూడా వెనకాడరని వెల్లడించింది. సంగీత బృందంలోని 11 మంది సభ్యులు పోర్న్ సైట్స్ చూశారన్న నెపంతో వారిని పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ గన్ తో అతి దారుణంగా కాల్చి చంపి, అనంతరం వారి శరీరాలను ఆర్మీ యుద్ధ ట్యాంకులతో తొక్కించారని తెలిపింది. ఎవరైనా కిమ్ జాంగ్ ఉన్ కు విశ్వాసంగా లేరని అనిపిస్తే చాలు వారి అక్కడిక్కడే ఉరితీస్తారని.. అతి కష్టం మీద ఉత్తరకొరియా నుండి దక్షిణ కొరియాకు తప్పించుకొని వచ్చి ప్రస్తుతం సియోల్ లో ఉంటున్నట్లు ఆమె వెల్లడించింది.