బినామీల గుట్టు చెప్పు.. కోటి పట్టు..

SMTV Desk 2017-09-23 12:12:29  Central Board of Direct Taxes, Informer, Central government, Benami assets,

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 : బినామీల గుట్టు వెల్లడించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ ప్రక్రియకు దేశ ప్రజల పూర్తి సహకారం తీసుకోవాలని భావిస్తు౦డగా.. ఎవరైతే ఈ బినామీ ఆస్తుల వివరాలను తెలియజేస్తారో, వారికి ప్రభుత్వం భారీ మొత్తంలో నజరానా ప్రకటించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. వారు అందించిన సమాచారం విలువను బట్టి కనిష్టంగా దాదాపు రూ. 15 లక్షల నుండి రూ. కోటి వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బినామీల వివరాలు తెలుసుకోవడం కష్టంగా ఉందని, ఈ విధంగా ప్రజలకు ఒక బాధ్యతను అప్పగించి వారికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తే, వారే చూసుకుంటారని కేంద్ర౦ భావిస్తోంది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్ అధికారి వెల్లడించారు.