సెప్టెంబర్ 23న భూమి అంతం కాబోతుందా ?

SMTV Desk 2017-09-22 16:01:16  At the end of world, Astronomers, David Mead,Nibir planet

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ప్రపంచంలోని ప్రజలను ఓ వార్త బెంబేలెత్తిస్తోంది. అంతర్జాతీయ న్యూస్ ఛానల్స్, వెబ్ సైట్స్ లలో కథనాల ద్వారా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంతకు ఏంటా కథనం...! మీకు ఏమైనా ఆఖరి కోరికలు ఉంటే మరో 24 గంటల్లో అంటే సెప్టెంబర్ 23లోగా తీర్చేసుకోండి అని సూచిస్తున్నారు. అసలు ఏమైంది అని విచారిస్తే... ఇక భూమి మీద జీవ మనుగడ అసాధ్యమేనని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సారి ఖచ్చితంగా యుగాంతం రాబోతుందని అమెరికాలోని డేవిడ్ మీడ్ ఆలోచన ప్రకారం ప్రచారం చేస్తున్నారు. క్రైస్తవ మత పవిత్ర గ్రంధమైన బైబిల్ లోని, గిజా పిరమిడ్ లో ప్రళయ బీభత్సానికి ఆధారాలున్నాయని, భూమికి దగ్గరగా నిబిరు గ్రహం రావడంతో సుమారు 24 గంటల్లో భూమి అంతం కాబోతుందని పలువురు శాస్త్రవేత్తలు అంటున్నారు. గతంలో ఎన్నో సంవత్సరాల నుండి పలు మార్లు యుగాంతం ప్రచారం కొనసాగుతూనే ఉంది.