అతనితో సన్నిహిత సన్నివేశాలలో నటించను : ఐశ్వర్యరాయ్

SMTV Desk 2017-09-22 12:43:39  Fanney Khan movie, Aishwarya rai, Rajkumar Rao.

ముంబై, సెప్టెంబర్ 22 : మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ స్టార్ కథానాయిక ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం "ఫన్నీ ఖాన్" అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఐష్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. నటుడు రాజ్‌కుమార్ రావుతో కొన్ని సన్నిహిత సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగా... ఈ సీన్లను తీవ్రంగా వ్యతిరేకి౦చిన ఐశ్వర్య, తాను అలాంటి సన్నివేశాలలో నటించబోనని ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం. గతంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్.., రణ్‌బీర్ కపూర్ తో "ఏ దిల్ హై ముష్కిల్" అనే చిత్ర౦లో నటించిన విషయం విదితమే. అయితే ఆ సినిమాలో రణ్‌బీర్ తో సన్నిహిత సన్నివేశాలలో నటించిన ఐశ్వర్య.. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఐశ్వర్య తన కుటుంబం పరంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2000 సంవత్సరంలో వచ్చిన డొమినిక్ డ్యూరుడెరే ఆస్కార్ చిత్రం "ఎవ్రీబడీ ఫేమస్" అనే చిత్రం స్పూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.