మణిరత్నం సినిమాలో ఛాన్స్ కొట్టేసిన విజయ్ దేవరకొండ

SMTV Desk 2017-09-21 21:40:52  arjun reddy, maniratnam, vijay devarakonda, vijay next movie,

హైదరాబాద్ సెప్టెంబర్ 21: ఒక్క సినిమా హిట్ తో స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తో విజయ్ కి తెలుగులోనే కాదు తమిళంలోను మంచి పేరు వచ్చింది. అయితే తాజాగా మణిరత్నం సినిమాలోనే హీరోగా ఛాన్స్ కొట్టేశాడని సమాచారం. ప్రస్తుతం మణిరత్నం ఒక మల్టీ స్టారర్ ను తెరకెక్కించే పనిలో వున్నారు. ఈ సినిమాలో శింబు .. విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ .. జ్యోతిక .. ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రలను పోషించనున్నారు. ఈ సినిమా తరువాత ఒక ప్రేమకథ చిత్రాన్ని తెరకేక్కించనున్నారట. ఆ కథ కోసం హీరోని వెతుకుతుండగా, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ నటన బాగా నచ్చడంతో ఈ సినిమా కోసం తీసుకోనున్నారని కోలీవుడ్ లో టాక్. మణిరత్నం సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. విజయ్ కి చాలా తక్కువ కాలం లో ఈ ఛాన్స్ రావడం విశేషమే. ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.