ఈ ట్రాక్టర్ కు డ్రైవర్ అవసరం లేదు

SMTV Desk 2017-09-21 15:49:59  Mahindra Group, Driver Less Tractor, Agricultural sector,Managing Director Pawan Goyank

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21 : ప్రముఖ వాహన తయారి సంస్థ మహీంద్ర గ్రూప్ మరో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. చెన్నైలో అభివృద్ధి చేసిన తొలి చోదక రహిత ట్రాక్టరు ను మంగళవారం ఢిల్లీలో ప్రారంభించింది. డ్రైవర్ లెస్ ట్రాక్టరుతో వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని సంస్థ మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయాంక్ తెలిపారు. ఈ నూతన యాంత్రీకరణ పద్ధతిని ప్రపంచ వ్యవసాయ రంగానికి అంకితం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని నిర్ణీత కాలపరిమితిలో మహీంద్రా ట్రాక్టర్లన్నింటికీ వర్తింప చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. అమెరికా, జపాన్ దేశాల్లోను ఈ టెక్నాలజీని విస్తరించి ప్రపంచ పోటీ మార్కెట్ లో సాంకేతికంగా అగ్ర స్థానంలో నిలుస్తామని సంస్థ తెలిపింది.