ముస్తాబైన ఇంద్రకీలాద్రి దుర్గమ్మ... ఉత్సవాలకు సర్వం సిద్ధం

SMTV Desk 2017-09-21 15:04:28  Vijayawada, kanakadhurgamma , Sarannavaratrulu,

విజయవాడ, సెప్టెంబర్ 21 : దక్షిణ భారతంలో మైసూర్ తరువాత అత్యంత వైభవంగా జరిగే దేవి శరన్నవరాత్రులకు విజయవాడ ఇంద్రకీలాద్రి సర్వాంగసుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి దసరా ఉత్సవాలు మొదలైనాయి. 10 రోజులపాటు కన్నుల పండుగగా సాగే ఈ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. తొలి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే కళారాధన వేదికలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా భద్రత సిబ్బంది ఏర్పాటు చేశామని నగర పోలిస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. దుర్గా దేవాలయ అభివృద్ది పన్నులో భాగంగా కొండపైన గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.