ఆయుష్‌ వైద్యసీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

SMTV Desk 2017-09-21 10:57:29  ayush, telangana health university, ayush notification

హైదరాబాద్ సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్రంలోని హెల్త్ యూనివర్సిటీ ఆయుష్ వైద్య సీట్ల భర్తీ కోసం బుధవారం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నీట్ ర్యాంకుల ఆధారంగా ఆయుష్ వైద్య సీట్లను భర్తీ చేయనున్నారు. సీట్ల కోసం పోటీపడే విద్యార్ధులు ఈ నెల 21 తేది ఉదయం 11 గంటల నుంచి 29 తేది సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, బీసీ విద్యార్ధులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు రూ.2000 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 30న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. వచ్చే నెల 3 నుంచి విద్యార్ధుల సర్టిఫికెట్లు పరీశీలన జరుగుతుందని తెలియజేశారు.