క్యుములోనింబస్ మేఘాలతో... భారీ వర్షాలు

SMTV Desk 2017-06-06 10:37:22  cumulonimbus clods, ap, telangana, hevy rains

హైదరాబాద్, జూన్ 6 : అల్పపీడన ద్రోణి విస్తరణ ద్వారా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈనెల 7 నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ వివరించింది. జార్ఖండ్ నుంచి ఉత్తరకోస్తా వరకు అల్పపీడన ద్రోణి నెలకోని ఉండడం అది విస్తరిస్తుండడం మూలంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ముఖ్యంగా 7,8 తేదిల్లో తెలంగాణలో..8,9 తేదిల్లో కోస్తాంధ్రలో భారీవర్షాలు కురువనున్నాయి. మరోవైపు వర్షాలు లేనిచోట మాత్రం అధిక ఎండలు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. అప్పుడప్పుడు వర్షాలు కురిసినా పూర్తిస్థాయిలో వాతావరణం చల్లబడదని..రుతుపవనాలు ప్రవేశించే వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఎండలు తప్పవని ఆయన వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేస్ రాష్ట్రాల్లో ప్రవేశించే రుతుపవనాలను అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం అడ్డుకుంటోందని ఆయన చెప్పారు. మూడు నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ఆవర్తనం కారణంగా నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోనే నిలిచిపోయాయని..అవి ముందుకు కదలడానికి అనువైన వాతావరణం లేదని తెలిపారు. ఉపరితల ఆవర్తనం ఈనెల 8 నాటికి తగ్గిపోయో అవకాశం ఉందని ..ఆతర్వాత నైరుతి రుతుపవనాలు బలపడి తెలుగురాష్ట్రాలకు విస్తరిస్తాయని వెల్లడించారు. ఈనెల 12 నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందని చెప్పారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితి వల్లే రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించిన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని ..కేరళాలో ఓ చోట ఏకంగా 37 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తల లెక్క ప్రకారం 50 రకాల మేఘాలున్నాయి. ఎంతఎత్తులో ఉంటాయి.. అవి ఏర్పడే తీరు, వర్షం వస్తుందా రాదా అన్న లక్షణాల ఆధారంగా మేఘాలను వర్గీక రించారు. వీటిలో క్యుములోనింబస్ మేఘాలకు ప్రత్యేక స్థానముంది. ఈ మేఘాలను క్లౌడ్ -9 గా కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ భాషా విశేషణాల ప్రకారం దీనికి అత్యంత ఉన్నతమైన, శక్తివంతమైన అని అర్థం. ఇవి భూ ఉపరితలానికి సుమారు ఏడు కిలోమీటర్లపైన అప్పటికప్పుడు భారీగా ఏర్పడుతాయి. ఇతర మేఘాల కంటే భిన్నంగా ఒక్కసారిగా అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. ఇక ఈ మేఘాలకు పైన సిర్రొక్యుములస్ మేఘం ఉంటుంది. అవి అత్యంత మందంగా ఉండి రుతుపవనాల ముందు ఏర్పడుతాయి. అందువల్ల వీటిని రుతుపవనాల రాకకు సూచికంగా చెబుతారు.