ఈ నీళ్ళ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా..!

SMTV Desk 2017-09-20 16:11:13  65 lakhs water bottle, Daimand edition, The Beverly Hills Drink Company Company,

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20 : సాధారణంగా మనం తాగే నీళ్ళ బాటిల్ ఖరీదు ఎంతుంటుంది... మహా అయితే రూ. 20 నుండి 50 వరకు ఉండొచ్చు. ఒకవేళ ప్రముఖులు, ధనవంతులు తాగే నీళ్ళ బాటిల్స్ అయితే ఆ ధర వేళల్లో ఉంటుంది. కాని ఇక్కడ ఒక నీళ్ళ బాటిల్ ఖరీదు ఏకంగా రూ.65లక్షలు ఉండడం విశేషం.. అసలు విషయం ఏంటంటే.. "లగ్జరీ వాటర్‌ బాటిళ్ల" ను మార్కెట్లోకి తీసుకురావాలని కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న "ద బేవెర్లే హిల్స్‌ డ్రింక్‌ కంపెనీ సంస్థ" భావిస్తోంది. దక్షిణ కాలిఫోర్నియాలోని పర్వత ప్రాంతాల్లో సుమారు 5500 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటితో ఈ బాటిల్ ను నింపుతారు. అయితే వీటికి అంత ఖరీదు ఎందుకంటారా..! ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన ఈ వాటర్ బాటిల్ లోపల, బయట అంతా ప్రత్యేకమే. అంతేకాదండోయ్.. 90H2O పేరుతో రానున్న ఈ వాటర్ బాటిల్స్ లో మొత్త౦ 14 క్యారెట్ల విలువైన 250 నల్ల వజ్రాలను పొదిగించడమే కాదు, బాటిల్ మూతను కూడా ప్లాటిన౦తో తయారుచేశారట. ఇప్పుడర్ధమైందా.. ఈ బాటిల్ ఎందుకు ఇంత ఖరీదో..! ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉందండోయ్, ఈ వాటర్ బాటిల్ ను తయారు చేసింది అమ్మడానికి కాదట. డైమండ్ ఎడిషన్‌ ప్యాకేజీగా పిలిచే దీన్ని ఏడాది పాటు సరఫరా చేసే లైఫ్‌స్టైల్‌ కలెక్షన్స్‌ ఎడిషన్‌లో భాగంగా అందించనున్నారు.