మొదలైన బతుకమ్మ వేడుకలు

SMTV Desk 2017-09-20 13:40:07  bathukamma festival, Telangana, CM KCR

హైదరాబాద్, సెప్టెంబర్ 20 : నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ తంగేడు, గునుగు, బంతీ, చామంతి పూల సందడితో మొదలుకానుంది. బుధవారం భాద్రపద అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై, 28వ తేదీన ఆశ్వయుజ నవమి నాడు జరిగే సద్దుల బతుకమ్మ వరకు ఈ పండుగ అంగరంగవైభవంగా జరగనుంది. తొమ్మిది రోజులపాటు అన్ని జిల్లాల్లో పండుగను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి జిల్లాకు రూ. 5 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. అలాగే తెలంగాణ ఆడపడుచులకు పూల పండుగకు ఎటువంటి కొదువ రావద్దని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రత్యేకత తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని తెలంగాణ మహిళలు, ప్రజలు పండుగ చేసుకునేందుకు సన్నాహాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, యాస, భాషలను ప్రతిబింబిస్తూ ప్రతి ఇంటా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు.