తయారి మానేస్తే రూ. 2 లక్షలతో ఉపాధి

SMTV Desk 2017-05-28 12:02:50  gudumba ,2 lakhs,exice,akunsabarvale

హైదరాబాద్, మే 26 : రాష్ట్రాన్ని గుడుంబా రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు తీవ్రం చేసింది. ఓ వైపు దాడులు నిర్వహిస్తూనే మరో వైపు సంక్షేమంతో గుడుంబా తయారీ వృత్తిని మార్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నది. గుడుంబా తయారీ వృత్తిని మానేసిన వారికి 2 లక్షల రూపాయలతో స్వయం ఉపాధి పథకం ద్వారా లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకు జిల్లాలలో గుర్తించిన గుడుంబా గ్రామాలలో కార్యచరణ అమలు చేస్తోంది. వచ్చే అక్టోబర్ 2 నాటికి గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ఎక్సైజ్ అధికారులకు నిర్ద్యేశించారు. ఆ మేరకు గుడుంబా గ్రామాలను,గుడుంబా తయారుచేసే వారిని గుర్తించే పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ గుడుంబా తయారి మానేసిన 236 మందికి 2లక్షల చొప్పున స్వయం ఉపాధి పథకానికి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. భలే మంచి భేరం అంటూ గిరిజనులు, ఇతరులు గుడుంబా తయారి మానేస్తున్నట్లు అధికారుల ముందు లొంగిపోతున్నారు.