మారువేషంలో తిరుగుతున్న డేరా బాబా ఇష్టసఖి...

SMTV Desk 2017-09-19 17:59:51  Haryana, Punjab, Nepal, honey preeth, kathmandu, daranitahari

హర్యానా, సెప్టెంబర్ 19: సాధ్విల అత్యాచార కేసులో డేరా బాబా గుర్మిత్ సింగ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అప్పటినుండి తన శిష్యురాలైన హనిప్రీత్ కనిపించకుండా మాయమైపోయింది. అయితే ఇటివల ఉదయపూర్ లో డేరా సచ్చా సౌద ఇంచార్జ్ ప్రదీప్ అరెస్టు కారణంగా తాజాగా ఓ సమాచారం తెలిసింది. హనిప్రీత్ సింగ్ మారువేషంలో నేపాల్ రాజధాని అయిన ఖాట్మండులో ధరన్ఇటహరి ప్రాంతంలో నివసిస్తుందని ప్రదీప్ తెలిపాడు. ప్రస్తుతం నేపాల్ మీదుగా చైనాకు పారిపోతున్నట్టు సమాచారం అందిన పోలీసులు వెంటనే ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే హనిప్రీత్ జాడ తెలిస్తే చెప్పాలని నేపాల్ రేడియోలో ప్రకటన కూడా చేశారు. దీంతో నేపాల్ లోనే అరెస్టు చేసేందుకు నేపాల్, హర్యానా పోలీసులు గాలిస్తున్నారు.