అమెజాన్ వంటి వెబ్‌సైట్ లకు పోటీగా..

SMTV Desk 2017-09-19 17:42:49  AMAZON, BIG BASKET, TATA GROUPS ONLINE BUSINESS, BIG BAZAR.

ముంబై, సెప్టెంబర్ 19 : అమెజాన్, బిగ్ బాస్కెట్ వంటి వెబ్‌సైట్ల మీద దెబ్బ ప‌డే అవ‌కాశం ఉందా..? అంటే అవుననే అంటున్నాయి వ్యాపార వర్గాలు. ఎందుకంటే త్వరలోనే ఆన్‌లైన్ లో నిత్యావ‌స‌రాల స‌రుకుల బిజినెస్‌లోకి టాటా గ్రూప్ అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే బిగ్‌బ‌జార్ కూడా ఆన్‌లైన్ మార్కెట్లోకి రానున్నట్లు ప్రకటించి౦ది. దీంతో అమెజాన్ వంటి వెబ్ సైట్ల మధ్య పోటీ పెరగనుంది. టాటా, టేస్కో గ్రూపులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ట్రెంట్ హైప‌ర్‌మార్కెట్ రిటైల్ చైన్ తరఫున ఈ నిత్యావ‌స‌రాల స్టోర్‌ను ప్రారంభించే యోచ‌న‌లో టాటా గ్రూప్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు నెల‌ల్లోగా ఈ ఆన్‌లైన్ మార్కెట్ వెబ్‌సైట్‌, యాప్‌ల‌ను "స్టార్‌క్విక్" పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.