అప్రమత్తమైన జపాన్...!

SMTV Desk 2017-09-19 17:32:33  Japan, Tokyo, North korea, America

జపాన్, సెప్టెంబర్ 19: ఉత్తరకొరియా నెల రోజుల్లో రెండు సార్లు జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం చేపట్టిన నేపధ్యంలో జపాన్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా మొబైల్ క్షిపణి రక్షణ వ్యవస్థను తూర్పు తీరంలోని హోక్కైడోకు చేరవేసింది. అయితే 34 పీఏసీ-3 అనే పేరు కలిగిన ఈ క్షిపణి 20 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించ‌గ‌ల‌ద‌ని పేర్కొన్నారు. ఈ క్షిపణి తరలింపు చర్యకు సంబంధించి ఆ దేశ రక్షణ మంత్రి సునారియో నోడెరా అధికారిక ప్రకటన వెలువరిచారు. కాగా, 2015 నుండి జపాన్ దేశంలో అమలులో ఉన్న కొత్త రక్షణ చట్టం ప్రకారం తన మిత్ర దేశం అమెరికా రక్షణ కోసం ఆ దేశం క్షిపణులను సంధించవచ్చు.