నష్టాల బాటలో షేర్ మార్కెట్

SMTV Desk 2017-09-19 16:48:47  Sensex, Nifty, Share Rates, Business news

ముంబై, సెప్టెంబర్ 19: నేడు స్టాక్ మార్కెట్‌లు ముగింపు సమయానికి నష్టాలను చవి చూశాయి. 21.39పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 32,402.37వద్ద ముగియగా, 4.05 పాయింట్ల పతనంతో నిఫ్టీ 10,149.05 వద్దకు పడిపోయింది. ప్రారంభంలో మాత్రం కాస్త దూకుడు ప్రదర్శించిన సెన్సెక్స్ మదుపర్లు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేయడంతో సాయంత్రం ముగింపు సమయానికి నష్టాల బాట పట్టింది. అటు నిఫ్టీ కూడా 26 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఒకానొక సమయంలో 10,178.85 పాయింట్లతో కొత్త శిఖరాలను చేరుకుంది. కానీ మధ్యాహ్నం సమయానికి 5.55 పాయింట్లు నష్టంతో 10,147.55 వద్ద స్థిరపడింది. కాగా, అమెరికా డాలర్ విలువ రూపాయి మారకంతో 64.29 వద్ద ఉంది. ఎన్‌ఎస్‌ఈలో గెయిల్‌, టాటామోటార్స్‌, టాటామోటార్స్‌(డి), భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌ షేర్లు లాభపడగా.. కోల్‌ ఇండియా, అరబిందో ఫార్మా, హిందాల్కో, ఐషర్‌మోటార్స్‌, హెడీఎఫ్‌సీ షేర్లు నష్టాల బాట పట్టాయి.