మరో సమస్యపై పోరాటానికి పవన్ సిద్ధమా..

SMTV Desk 2017-09-19 16:20:41  Pawan Kalyan, Janasena, AP Petroleum dealers association, Guntur

గుంటూరు, సెప్టెంబర్ 19: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరో సమస్యపై దృష్టి సారించనున్నారు. ఏపీ పెట్రోలియం డీల‌ర్ల అసోసియేష‌న్ స‌భ్యులు తమ సమస్యలు పవన్‌‌కు వినిపించి తద్వారా పరిష్కారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు నేడు గుంటూరు జిల్లాలో అసోసియేష‌న్ సభ్యులు జ‌న‌సేన నేత‌ల‌తో సమావేశమైనట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లాలని జనసేన నేతలకు డీల‌ర్ల అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు రావి గోపాల‌కృష్ణ విన‌తి ప‌త్రం అందజేశారు. అయితే ద‌స‌రా ఉత్స‌వాల అనంతరం పవన్ కళ్యాణ్‌తో భేటి ఏర్పాటు చేయనున్నట్లు జ‌న‌సేన నేతలు తెలిపారు. కాగా, ఇటీవల ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం జనసేన అధ్యక్షుడు పోరాడిన విషయం తెలిసిందే.