చీరల పంపిణీ కార్యక్రమ౦లో అపశ్రుతి....

SMTV Desk 2017-09-18 17:59:36  hyderabad, saidhabad, sarees distribution program

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా చేపట్టిన చీరల పంపిణీలో అపశ్రుతి చోటుచేసుకుంది. తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు నుండి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా భాగ్యనగర౦లో సైదాబాద్‌లోని శిశుమందిర్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీలో కొందరు మహిళలు ఘర్షణకు దిగారు. సుమారు ఒక పది నిమిషాల పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ తగువులాడారు. ఆ సమయంలో మహిళా కానిస్టేబుల్‌ ఒక్కరే ఉండడంతో ఘర్షణను అడ్డుకోలేకపోయారు. ఈ ఘటనలో పలువురు మహిళలు గాయపడ్డారు. వీరి మధ్య జరిగే ఘర్షణకు ప్రధాన కారణం ఎక్కువ సేపు క్యూలైన్లలో నిలబడడమేనని స్థానికులు వెల్లడించారు. ఈ సంఘటనతో రేపు జరిగే చీరల పంపిణీలోనైనా ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు చెపట్టాలని మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.