ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రూ.30 లక్షల పచ్చలహారం

SMTV Desk 2017-09-18 17:52:07  Indrakeeladri Kanakudurgamma, Paccalaharam, Namburi Shankara Rao

అమరావతి, సెప్టెంబర్ 18 : ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు గుంటూరు జిల్లా భక్తుతుడైన శుభగృహ సంస్థ నిర్వాహకులు నంబూరి శంకరరావు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారికి రూ.30 లక్షల విలువైన పచ్చలహారం సమర్పించారు. ఈ మేరకు త్వరలో ఘనంగా జరిగే దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ఈ పచ్చలహారం అలంకరించనున్నారు. సోమవారం దుర్గగుడి ఈవో సూర్యకుమారి, ఛైర్మన్‌ గౌరంగబాబుని కలిసి ఈ హారాన్ని అందజేశారు.