కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో..!: పాక్ పోలీస్

SMTV Desk 2017-09-18 17:41:59  Virat kohli, marriage proposal, Pakistan police, Kohli, Marry Me

ముంబై, సెప్టెంబర్ 18: భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీకి వినూత్న పెళ్లి ప్రపోజల్ వచ్చింది. కోహ్లీ ఆటకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఇండిపెండెన్స్ కప్ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్లిన ప్రపంచ ఎలెవెన్ జట్టులో కోహ్లీ, ధోని ఇంకా ఇతర భారత ఆటగాళ్లు ఎవరు వెళ్లకపోవడంతో పాక్ అభిమానుల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా వారు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ తరుణంలో తన అభిమానాన్ని చాటుకుంటూ ఓ పాకిస్తాన్‌ పోలీసు చేసిన 'పెళ్లి ప్రపోజల్' ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది. లాహోర్ స్టేడియం వేదికగా అభిమానులు పలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఫోటోలు సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేశారు. అయితే అన్ని మెసేజ్‌లు, ఫోటోలకంటే ఓ ఫోటో మాత్రం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తేస్తోంది. ఆ ఫొటోలో ఓ పాక్ పోలీసు "కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో..!" అని ఓ ప్లకార్డుపై రాసి ప్రదర్శించారు. దీన్ని ఎవరో ఫోటో తీసి అలా ట్విటర్లో పెట్టారో లేదో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు షేర్ చేసుకుని, ఆ పోస్ట్‌లో హాస్యాన్ని పండిస్తున్నారు. ప్రపంచంలో అనేక మంది అమ్మాయిలు కోహ్లీకి ప్రపోజ్ చెయ్యడం చూశాం గానీ ఈ తరహా ప్రతిపాదన మాత్రం చాలా వింతగా ఉందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. కాగా, ఇంగ్లాండ్ క్రికెట్ క్రీడాకారిణి డానియెల్ వ్యాట్‌ ఇటీవల కోహ్లీని పెళ్ళడతానంటూ సంచలనాత్మక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.