సంకల్పసభలో రాజ్ నాథ్...

SMTV Desk 2017-09-17 18:26:00  Nizamabad, home minister rajnath singh, bjp mla laxman

నిజామాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ సంకల్ప సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో కేంద్ర హో౦మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..." చరిత్రలో తెలంగాణ విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను ఒక ప్రత్యేకమైన రోజుగా భావిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ సంస్థానంలోని వారు దేశంలో విలీనం కావాలని ఆకాక్షించగా, ఆనాడు బ్రిటిష్ వాళ్లు దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించారు. మహనీయుడు సర్దార్ వల్లబాయ్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందని, సెప్టెంబర్ 17ను దేశం, తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోవని" అయన పేర్కొన్నారు. అదేవిధంగా ఈ సభలో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ..." ఆనాడు వల్లభాయ్ పటేల్ నిజాం మేడలు వంచి తెలంగాణను ఇండియన్ యూనియన్ లో కలిపారని గుర్తు చేస్తూ నేడు అభినవ పటేల్ రాజ్ నాథ్ సింగ్ టీఆర్ఎస్ మేడలు వంచి సెప్టెంబర్ 17ను విమోచన దినాన్ని జరిపించడానికి వచ్చారన్నారు. విమోచనను విచ్చిన్నమని ప్రకటించిన హో౦మంత్రి నాయినిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 2019 నాటికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవం రోజున గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేస్తామని" తెలిపారు.