మంచి ఛాన్స్ కొట్టేసిన షాలిని పాండే

SMTV Desk 2017-09-16 13:29:48  Shalini pande, Arjun reddy movie, Vijay Devarakonda, mahanati movie.

హైదరాబాద్, సెప్టెంబర్ 14 : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన "అర్జున్ రెడ్డి" చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన భామ షాలిని పాండే. ఈ సినిమా ఘన విజయం సాధించగా ఒక్కసారిగా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. దీంతో షాలినికి అవకాశాలు వరుస కట్టాయి. అయితే ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఓ ప్రశ్న ఎదురైంది. మీరు "మహానటి" చిత్రంలో నటిస్తున్నారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. "అవును నేను నటిస్తున్నా, కాని పాత్ర ఏ౦టన్నది మాత్ర౦ చెప్పను" అంటూ బదులిచ్చింది. అంతేకాకుండా తమిళ౦లో "100 శాతం కాదల్" అనే చిత్రానికి కూడా సంతకం చేశానని, వాటితో పాటు మరిన్ని చిత్రాలకు ఓకే చెప్పినట్లు వెల్లడించింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని షాలిని పాండే తెలిపింది.