అమెరికా అధ్యక్షుడికి ఘోర అవమానం..!

SMTV Desk 2017-09-16 12:15:46  america president donald trump, twits, Twists printed on cheppals, Presidential Flip Flaps.

వాషింగ్టన్, సెప్టెంబర్ 16 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడే ప్రతి మాట, చేసే ట్వీట్ కొన్నిసార్లు సంచలనాలకు దారి తీస్తూ ఉంటాయి. ఏదైనా ఒక విషయ౦ గురించి ముందు అనుకూలంగా మాట్లాడి, ఆ తర్వాత విమర్శిస్తూ మరో ట్వీట్‌ చేయడం ట్రంప్ స్టైల్. అయితే ఇలాంటి వ్యవహార తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి ప్రతిపక్షాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అందులో సోషల్ మీడియా కూడా ఒకటి. తాజాగా ట్రంప్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికాలోని ప్రెసిడెన్షియల్‌ ఫ్లిప్‌ ఫ్లాప్స్‌ అనే చెప్పుల తయారీ సంస్థ వినూత్న రీతిలో ఆలోచించి నేరుగా ట్రంప్ ను విమర్శించకుండా అతను చేసిన ట్వీట్లతో చెప్పులు తయారు చేసి ట్రంప్ మీద ఉన్న కోపాన్ని ఇలా ప్రదర్శించింది. సిరియా విషయంలో ట్రంప్ ప్రతీ సారి మాట మారుస్తుండడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ఇలా చేయించింది. ఇది కేవలం కొత్తదనం కోసం చేసిన ప్రయత్నం మాత్రమేనని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పుడీ ట్రంప్‌ ట్వీట్లతో ముద్రించిన చెప్పులు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.