అక్కడ రజినీకాంత్..ఇక్కడ మహేష్ బాబు..!

SMTV Desk 2017-09-15 22:49:18  spyder, maheshbabu, sj surya, super star

హైదరాబాద్ సెప్టెంబర్ 15: ‘భూమ్ భూమ్’ సాంగ్ రిలీజ్ అయిన తరువాత కారులో మహేష్ బాబు కూతురు హమ్ చేస్తూ సితార పాడిన పాట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ఎస్.జె.సూర్య ‘స్పైడ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌’లో వేదికపై మాట్లాడుతూ ఆ వీడియోను గుర్తు చేశాడు. ఆ వీడియో తనకు ఎంతగానో నచ్చిందని చెప్పాడు. ఇంకా సినిమా గురించి మాట్లాడుతూ ‘మహేష్ బాబు ఇంతవరకు సాధించిన రికార్డ్ లన్నిటిని స్పైడ‌ర్‌ అధిగ‌మిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడ సూపర్ స్టార్ రజిని కాంత్ ఎలాగో ఇక్కడ మహేష్ బాబు అని పొగిడారు. ‘జ‌నాభాని కంట్రోల్ చేసేందుకు సునామీ, భూకంపంలా నేనూ ఒక భాగ‌మే’ అంటూ స్పైడ‌ర్ సినిమాలో తాను చెప్పిన డైలాగ్ ను స్టేజి పై చెప్పారు.