నాది గాడిదల జాతి : ఆశారాం బాపు

SMTV Desk 2017-09-15 18:24:57  Asaram, Verdict about Asaram, Akhil Bharatiya Akhara Parishad

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15‌: తనని తానే సాధువుగా ప్రకటించుకొని ఆధ్యాత్మిక గురువుగా చలామణి అయిన ఆశారాం బాపు ప్రస్తుతం అత్యాచారం కేసులో అరెస్ట్‌ అయి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అఖిల భారతీయ అకార ప‌రిష‌త్ సంఘం ఆశారాం ఓ నకిలీ సాధు అని ఆరోపించింది. ఈ నేపధ్యంలో గురువారం ఆశారాంను విచారణ నిమిత్తం న్యాయస్థానానికి తీసుకొచ్చిన సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నిస్తూ మీరు సాధువు కాదు.. గురువు కాదు.. మరి ఏ కేటగిరీకి చెందుతారు..? అని ప్రశ్నించగా సంచలనాత్మకంగా జవాబు ఇస్తూ... నేను గాడిదల కేటగిరీకి చెందినవాడిని అని చెప్పి ఆగ్రహంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. సాధువుల సంఘం వెలువరిచిన జాబితాలో ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ్‌ సాయి పేర్లు కూడా ఉన్నాయి.