అగ్రిగోల్డ్ వ్యవహార౦పై ముఖ్యమంత్రి స్పందన

SMTV Desk 2017-09-15 16:59:21  agrigold, cm chandrababu naidu, cid officers, high court verdict.

అమరావతి, సెప్టెంబర్ 15 : అగ్రి గోల్డ్ సంస్థ వ్యవహారంపై మొదటి నుంచి చాలా కఠినంగానే ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ.. అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా సహకరి౦చేందుకు ముందు౦టామని, వారందరికీ న్యాయం జరిగేలా అన్ని శాఖలు చొరవ చూపాలని వెల్లడించారు. అయితే ఈ అగ్రి గోల్డ్ సంస్థ కేసులో భాగంగా విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు, ఏపీలో 3,900 కోట్ల రూపాయల బకాయిలు ఉందని, అదే దేశవ్యాప్తంగా చూసుకుంటే 6,381 కోట్లు బకాయిలు ఉన్నాయని సీఐడీ తేల్చింది. ఈ నేపధ్యంలో సీఐడీ సేకరించిన వివరాలను ఆ శాఖ చీఫ్ ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రికి వివరించారు. అన౦తరం తిరుమలరావు మాట్లాడుతూ.. అగ్రి గోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశాన్ని ఇప్పటికే హైకోర్టుకు వివరించామని తీర్పు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.