విజృంభించిన పీవీ సింధు

SMTV Desk 2017-09-15 16:39:55  PV Sindhu, Korea Open super series, Badminton

దక్షిణ కొరియా, సెప్టెంబర్ 15: కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జోరు కొనసాగిస్తోంది. నేడు దక్షిణ కొరియాలో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి మినత్సు మితానితో ఆడగా 21-19, 16-21, 21-10 సెట్ల తేడాతో ఓడించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించిన వీరి పోరులో తొలి సెట్‌లో సింధు విజయం సాధించగా రెండో సెట్‌ను కోల్పోయింది. తిరిగి మూడో సెట్‌లో విజృంభించి మితానిని ఓడించి గెలుపు కైవసం చేసుకుంది. కాగా, వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన విషయం తెలిసిందే.