హరికేన్ ధాటికి గురైన బాధితులకు డోనాల్డ్ ట్రంప్‌ పరామర్శ

SMTV Desk 2017-09-15 15:59:22  Irma Hurricane, American President Donald Trump, Naples,Melania, Vice President Pens

నేపుల్స్, సెప్టెంబర్ 15 : ఇర్మా హరికేన్ ధాటికి ఉక్కిరిబిక్కిరి అయిన ఫ్లోరిడా రాష్ట్రాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సందర్శించారు. నేపుల్స్‌లో పర్యటించి బాధితులను పరామర్శించిన ఆయన, అనంతరం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా ప్రతిస్పందించిన సహాయక సిబ్బందిని ట్రంప్ అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు పెన్స్‌ కూడా పాల్గొన్నారు. ఈ మేరకు వరద బాధితులను తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.