కోట్ల ఆస్తిని, కుమార్తెను వదులుకుంటున్న తల్లిదండ్రులు...!

SMTV Desk 2017-09-15 14:44:09  Neemuch town in Madhya Pradesh, Jain Religion,Sumit, Anamika Radhad, Monks

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : రూపాయి.. రూపాయి పోగు చేసి కుటుంబాన్ని సుఖపెట్టాలని అనుకుంటారు తల్లిదండ్రులు, పిల్లలకు ఏ చిన్న జబ్బు చేసిన తట్టుకోలేరు. అలాంటిది వారిని దూరం చేసుకోవడం మాములు విషయం కాదు. సంపాదించిన ఆస్తిని త్యాగం చేయడం కూడా అందరి వల్ల కాలేదు. కానీ దీనికి ఓ కుటుంబం సిద్ధం కాబోతున్నారు. మధ్యప్రదేశ్ లోని నీమచ్ పట్టణంలో జైన్ మతానికి చెందిన సుమిత్‌, అనామికా రాథోడ్ అనే దంపతులు సంసార జీవితాన్ని తృణప్రాయంగా వదిలేశారు. నమ్మలేకపోయినా ఇది నిజం. పారిశ్రామికవేతైన సుమిత్‌ ఆస్తి రూ. 100కోట్లకు పైనే ఉంటుంది. కానీ డబ్బుకన్న ఆధ్యాత్మికతే ముఖ్యమని భావించిన ఆయన ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయనతో పాటు భార్య అనామికా కూడా ఆధ్యాత్మిక భావనే ఎంచుకున్నారు. వీళ్ల కుమార్తెను బంధువులకు దత్తత ఇచ్చి, కోట్ల రూపాయల ఆస్తిని వదిలేసి సన్యాసం తీసుకునేందుకు సిద్దమయ్యారు. ఈ నెల 23న సూరత్ లో జరిగే కార్యక్రమంలో ఈ దంపతులు జైన్ సన్యాసులుగా మారనున్నారు. ముందు నుంచి వీళ్లు దైవారాధనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. వివాహమై ఓ పాప పుట్టిన తర్వాత కూడా ఈ దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకోవడం చాలా కఠినమైనది. ఇదో కఠోర తపస్సు, సంసార జీవితంపై విరక్తి చెందినవారు మాత్రమే దీన్ని స్వీకరించగలరని, అక్కడి స్థానికులు మీడియాకు తెలిపారు.