విజయ్ ఆంటోని సినిమాలో విజయ్ దేవరకొండ..?

SMTV Desk 2017-09-15 14:39:09  VIJAY DEVARAKONDAA, ARJUN REDDY MOVIE, VIJAY ANTONY, BICHAGADU KANNADA REMAKE.

హైదరాబాద్, సెప్టెంబర్ 15 : "పెళ్లి చూపులు" చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న హీరో విజయ్ దేవరకొండ "అర్జున్ రెడ్డి" సినిమాతో ఏకంగా స్టార్డంను అనుభవిస్తున్నాడు. ఈ సినిమా విమర్శకుల ను౦డి ఎన్ని ఘాటు వ్యాఖ్యలను ఎదుర్కొన్నా, చివరికి అందరికి సమాధానం చెబుతూ ఈ సినిమా ఘనవిజయ౦ సాధించడం గమనార్హం. ప్రస్తుతం విజయ్ సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తునట్టు తెలుస్తోంది. అయితే ఆయన కన్నడ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన "బిచ్చగాడు" సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడా సినిమాను కన్నడలో రీమేక్ చేయాలని ప్రముఖ నిర్మాత విజయ్ దేవరకొండను సంప్రదించినట్టు తెలుస్తోంది. దీనికి విజయ్ కూడా అంగీకారం తెలిపినట్లు సినీవర్గాల టాక్. అయితే ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.