అమెరికాలో తెలుగు డాక్టర్ దారుణ హత్య...

SMTV Desk 2017-09-15 12:17:24  america, kansas, nalgonda, miryalaguda, murder attemted on D.r. achyuth reddy

అమెరికా, సెప్టెంబర్ 15: అమెరికాలో తెలంగాణకు చెందిన డాక్టర్ దారుణ హత్య కు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన అచ్యుత్ రెడ్డి (57) తమ స్వస్థలం నుండి అమెరికాకు వచ్చి 28 సంవత్సరాలుగా స్థిరపడ్డారు. అచ్యుత్ రెడ్డి 25 ఏళ్లగా కాన్సాస్ రాష్ట్ర౦లో మానసిక వైద్య నిపుణుడిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున హోలిస్టిక్ క్లినిక్ లో చికిత్స పొందుతున్న ఉమర్ రషీద్ దత్ అనే వ్యక్తి అచ్యుత్ రెడ్డిని కత్తులతో దారుణ౦గా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అచ్యుత్ రెడ్డి మరణవార్త తెలియగానే తన స్వస్థలం అయిన మిర్యాలగూడలో తన తల్లిదండ్రులతో పాటు బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు.