కాంట్రాక్ట్‌ టీచర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు..

SMTV Desk 2017-09-15 10:50:45  Ap government, contract based residential teachers, salary increase.

అమరావతి, సెప్టెంబర్ 15 : ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులకు తీపి కబురు అందించింది. వారి వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పీజీ టీచర్లకు రూ.16, 150 ఉండగా, దానిని రూ.24,225 పెంచింది. అంతేకాకుండా టీజీ టీచర్లకు రూ.14,860 నుంచి రూ.22, 290, పీఈటీలకు రూ.10,900 నుంచి రూ.16,350, లైబ్రేరియన్లకు రూ. 13,660 నుంచి రూ.20,490 కు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వేతనాల పెంపుపై వివిధ గురుకుల ఉపాధ్యాయ సంఘాలు స్పందిస్తూ.. పెండింగ్ లో ఉన్న ఈ జీవోను విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.