తిరుపతి రుయా ఆసుపత్రిలో జూ.డాక్టర్ల సమ్మె..

SMTV Desk 2017-09-14 13:06:50  tirupati, ruia hospital, medicos in ruia hospital intensify protest

తిరుపతి, సెప్టెంబర్ 14: తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు గత ఆరు రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... రుయా ఆసుపత్రిలోని జూడాలకు 5 నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ౦టున్నారు. ఈ సమ్మెలో దాదాపు 137 మంది జూడాలు పాల్గొంటున్నారు. దీంతో ఆసుపత్రిలో అత్యవసర సేవలు నిలిచిపోవడంతో రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొ౦టున్నారు. ఈ సమ్మెలో భాగంగా జూడాలు, తమ సమస్యలు పరిష్కరించే వరకు విధులకు హాజరుకామని, 5 నెలల వేతనానికి కనీసం ఒక్క నెల వేతనం కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రికి వివరించినా ఫలితం లేదని వాపోయారు. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, కనీసం రెండు నెలల స్టైఫండ్ అయిన చెల్లిచాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.