మిత్ర దేశం అంటూనే...అమెరికా

SMTV Desk 2017-09-14 11:27:31  USA, Trump, India, Drugs

అమెరికా, సెప్టెంబర్ 14: భారత్ నిబంధనలకు విరుద్ధంగా ఉత్తరకొరియా నుండి దిగుమతులు చేసుకుంటుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించి రోజులు గడవక ముందే మిత్రదేశంలా చలమణి అవుతున్న అమెరికా, ఇండియాకు మరో షాక్ ఇచ్చింది. భారత్ దేశాన్ని మత్తు పదార్థాలను ఉత్పత్తి చేసి, రవాణా చేసే 21 దేశాల జాబితాలో ట్రంప్ ప్రభుత్వం చేర్చింది. మిగతా దేశాల కంటే ఇక్కడ తక్కువ స్థాయిలో మాదకద్రవ్యాల సమస్య ఉందంటూ కొంచెం ఊరట నిచ్చింది. కాగా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లు ఎక్కువ స్థాయిలో డ్రగ్స్ ను ఉత్పత్తి చేస్తున్నాయిని వెల్లడించింది. కొలంబియా, కోస్టారికా, బొలీవియా, బెలిజ్, బహమాస్, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, హైతీ, గ్వాటెమాలా, జమైకా, హోండురస్, నికరాగ్వా, మెక్సికో, పెరూ, పనామా, వెనెజువెలా తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల నైసర్గిక స్వరూపం డ్రగ్స్ ను ఉత్పత్తి చేయడానికి, రవాణా చేయడానికి సానుకూలంగా ఉండటంచేత వాటిని జాబితాలో చేర్చామని స్పష్టం చేశారు.