మీ మెయిల్ ఐడీ హ్యాక్ అయిందో.. లేదో.. ఇలా తెలుసుకోండి

SMTV Desk 2017-09-14 10:39:23  gmail id hack, special hacking website, https:///haveibeen pwned.com.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14 : ఆధునిక కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుందని సంబరపడాలో లేక అది దుర్వినియోగమవుతూ మన వివరాలన్నీ దళారుల చేతుల్లోకి వెళ్తున్నాయని బాధపడాలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి.. ప్రస్తుత కాలంలో కొంతమంది ప్రబుద్దులు ఎదుటి వ్యక్తి వ్యక్తిగత వివరాలను చాలా తేలికగా హ్యాక్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ వివరాలతో వారిని బ్లాక్ మెయిల్ చేసిన వారు లేకపోలేదు. అయితే మన మెయిల్ ఐడీ హ్యాక్ అయిందో లేదో మనకు మనమే తెలుసుకోవచ్చు. అదెలా అంటారా.. దానికోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ ఉంది. https:///haveibeen pwned.com అనే వెబ్‌సైట్‌ లోకి వెళ్లి మీ మెయిల్ ఐడీని ఎంటర్ చేస్తే హ్యాక్ అయిందో లేదో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఒకవేళ హ్యాక్ అయితే ఏ సర్వీస్ నుండి హ్యాక్ అయిందో కూడా తెలుస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఒకసారి ప్రయత్నించి చూడండి.