వజ్రాకృతి లో అసెంబ్లీ..స్థూపాకృతిలో హై కోర్టు

SMTV Desk 2017-09-14 10:36:05  Norman Foster Team, Chief Minister Chandrababu

అమరావతి, సెప్టెంబర్ 14 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే చంద్రబాబు నూతన రాజధానిలో నిర్మించబోయే కార్యాలయాల నిర్మాణ బాధ్యతలను లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ అనే సంస్థకు అప్పజెప్పింది. అయితే ఆ సంస్థ విభిన్న రూపాల్లో ఉన్న కార్యాలయ ఆకృతుల నమూనాలను ముఖ్యమంత్రికి చూపించడం జరిగింది. నార్మన్‌ ఫోస్టర్‌ బృందం అందించిన ఆకృతులనమునాలపై మంత్రివర్గ సహచరులు ఇతర ప్రభుత్వ ముఖ్యులతో సమాలోచన చేసి తుది నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు నేడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలోని నవ నగరాల్లో ముఖ్యమైన పాలన నగరానికి సంబంధించి శాసనసభ, హైకోర్టు, సచివాలయం శాఖధిపతుల ఆకృతులు అంతర్గత నిర్మాణ శైలి ఎలా ఉండాలన్న అంశంపై తుది ప్రణాళికలను నార్మన్ పోస్టర్ బృందం సిద్ధం చేసింది.