టికెట్ ఇవ్వాలంటే ఇంత కష్టపడాలా?

SMTV Desk 2017-09-13 17:52:06  Bus Conductor, Haryana, Social media

హర్యానా, సెప్టెంబర్ 13 : ఓ కండక్టర్ వృతి నిర్వహణలో భాగంగా విన్యాసాలు చేయడంపై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన ఓ కండక్టర్ బస్సులో ప్రయాణికులతో కిక్కిరిసి పోవడంతో టికెట్లు తీసుకోవడానికి బస్సును పక్కకు ఆపితే సమయం వృధా అవుతుందని గ్రహించిన కండక్టర్ సరి కొత్త విధానానికి తెర లేపి వార్తల్లోకి ఎక్కాడు. ఇంతకి కండక్టర్ ఏం చేశాడంటే.. ఎవరు ఊహించని విధంగా ఒక సీటు మీద నుంచి మ‌రో సీటుకు దాటుకుంటూ టికెట్లన్నీ తీసుకున్నాడు. అయితే ప్రయాణికులు కూడా ఇందుకు సహకరించడం గమనార్హం. ఎందుకంటే ప్రయాణికుల సమయం ఆదా చేయాలనే ఉద్దేశంతో కండక్టర్ వ్యవహరించిన తీరుకు ప్రయాణికులు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కండక్టర్ చేసిన ఈ ఫీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.