దేశంలో ఇదే మొదటిసారి

SMTV Desk 2017-09-13 15:26:51  Anti-Theft Packaging system, flipcart, senior director satyam choudhary, patent rights.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 : ఆన్‌లైన్ లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు, ఆ సరుకుల రవాణాలో జరిగే దొంగతనాలు ఓ పెద్ద సమస్యగా తయారయ్యాయి. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు చెక్క ముక్కలు, రాళ్ళు వస్తున్నాయంటూ వినియోగదారుల నుండి ఫిర్యాదులను అందుకున్న ప్రముఖ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఒక నూతన ప్యాకేజింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీ ద్వారా ఒకసారి ప్యాక్ చేసిన వస్తువును విప్పి, తిరిగి య‌థావిధిగా ప్యాక్ చేయడం అనేది అసాధ్యం అని ఫ్లిప్‌కార్ట్ సీనియ‌ర్ డైరెక్టర్ స‌త్యం చౌద‌రి తెలిపారు. ఒకవేళ అలా ఎవరైనా చేసినా ఆ వస్తువు షిప్‌మెంట్ కేంద్రాల‌కు చేరుకున్న వెంటనే తెలిసిపోతుందని వివరించారు. అయితే ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీపై పేటెంట్ హక్కుల కోసం కూడా ఫ్లిప్‌కార్ట్ ద‌ర‌ఖాస్తు చేసుకుంది. కేవలం ఈ దొంగతనాలను నియంత్రించే౦దుకే ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నట్లు సత్యం వెల్లడించారు.