కేసీఆర్ నిర్ణయం చాలా గొప్పది : వెంకయ్య నాయుడు

SMTV Desk 2017-09-13 14:57:20  CM KCR, 1 TO 12 CLASS TELUGU CLASS COMPULSORY, VICE PRESIDENT, VENKAIAH NAIDU

హైదరాబాద్, సెప్టెంబర్ 13 : ఒకటవ తరగతి నుండి 12 వ తరగతి వరకు తెలుగు భాషా బోధన తప్పనిసరి చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. మళ్ళీ మన తెలుగు భాషకు మరింత ప్రాముఖ్యతను చేకూర్చేలా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందించాల్సిన విషయం అన్నారు కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను కూడా స్వాగతిస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా ప్రతి వ్యక్తి మాతృభాషకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.